సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 25(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి.హైదరాబాద్ న్యాయవాది ఇజ్రాయిల్ పై జరిగిన దాడి దాడిని ఖండిస్తూ మంగళవారం నాడు సంగారెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా భార్ ఆసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాది ఇజ్రాయిల్ ని హత్య చేసిన దుండగుడిని వెంటనే శిక్షించాలని మరియు ఆ దుండగులు తరఫున న్యాయవాదులు ఎవరు వాదించకూడదని మరియు వెంటనే న్యాయవాదులు రక్షించటం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భార్ ఆసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబరీష్, కార్యవర్గ సభ్యులు లలిత, వినోద్ మరియు సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు