పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మంగళవారం ఐడిఒసి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. కృత్రిమ ,రంగులు, రసాయనాలతో కూడిన విగ్రహాలు పూజించి చెరువులలో, కాలువలలో నిమజ్జనం చేయడం వలన జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని, తద్వారా జలాల్లో నివసించే జీవరాసులు మనుగడ కష్టమవుతుందని తెలిపారు. మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగహన కల్పించేందుకు, మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ నెల 6వ తేదిన జిల్లాలోని ప్రధాన కూడళ్ళులో 8 అంగుళాల మట్టి గణపతి లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణంపై అహగహన కార్యక్రమాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారిచే నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు మట్టి విగ్రహాలను పూజించి జలాశయాలు కలుషితం కాకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్ , పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్ధ రెడ్డి, డీఈఓ రాజేందర్, బిసి, ఎస్సి సంక్షేమ అధికారులు శైలజ, సునిత, ఉద్యానవన శాకాధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.