ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి .

 

రోజుకి వేయి పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కరించాలి

…సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి జూన్ 29 ప్రజాబలం ప్రతినిధి:
ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ఎన్ని పరిష్కరించారని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఒక వేయికి తగ్గకుండా పెండింగ్ లోఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారించాలని, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలనీ ఆదేశించారు . సక్సేషన్, పెండింగ్, మ్యు టేషన్ వంటి దరఖాస్తుల రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , రెవిన్యూ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ వున్నా దరఖాస్తులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని తహసీల్దార్ ,రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా ప్రణాళికా బద్ధంగా, ప్రతిరోజూ పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు .
అన్ని మాడ్యు ల్స్ లో దాఖలైన దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష లో డి ఆర్ ఓ పద్మజా రాణి , కలెక్టరేట్ అడ్మినిస్ట్రషన్ అధికారి పరమేష్ ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking