సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై వీడియో
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 29:
ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ఎన్ని పరిష్కరించారని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని తహసీల్దార్ ,రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్, పెండింగ్ ,మ్యు టేషన్ వంటి దరఖాస్తుల రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని మాడ్యు ల్స్ లో దాఖలైన దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.