విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

 

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోషం అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల తెలంగాణ సాంగ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ కే మోహన్, హాజీపూర్ ఉప తహాశిల్ధార్ హరిత తో కలిసి ఆకస్మాక తనిఖీ చేసి పాఠశాల ఆవరణ,తరగతి గదులు, వంటశాల,రిజిస్టర్లు, రికార్డులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,మధ్యాహ్న భోజనం పోషక విలువలు గల ఆహారాన్ని మెనూ ఆహారాన్ని మేను ప్రకారం సకాలంలో అందించాలని అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగితే వారి అభ్యాసన సామర్థ్యలను వార్షిక పరీక్షలు సమీ పిస్తున్నందున పూర్తి చేసిన సిలబస్ను మరోసారి రివిజన్ చేయాలని అధికారులకు సూచించారు.మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందుతున్న మెనూ,ఆహారం, నాణ్యత పై నా విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు.
వేసవికాలం అయినందున విద్యార్థులకు ఎలాంటి అస్వస్థతకు గుడి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఎవరైనా అస్వస్థతకు గురైనట్టయితే వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్య తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking