▪️ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్వీప్ -2024 అవగాహన కార్యక్రమం…
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి23::
18 సం లు నిండిన ప్రతి విద్యార్థిని ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) కార్యక్రమం లో భాగం గా శనివారం వరంగల్ లోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలోని కళావేదిక హల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నోడల్ అధికారి మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, 01 ఏప్రిల్ 2024లోగా 18 సం.లు నిండిన విద్యార్థినులు ఎపిక్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, కేవలం ఓటు మాత్రమే వేయడమే కాకుండా కుటుంబ సభ్యులు బంధువులు ఓటు వేసే విధంగా వారిలో చైతన్యం తేవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్ , లెక్చరర్లు మాలతి, కృష్ణవేణి, అనురాధ, విజయ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.