శ్రీకాశీ ఆశ్రయ ట్రస్ట్ శ్రీనగర్ కాలనీ దిల్‌షుక్‌నగర్ హైదరాబాద్‌లో అధ్యక్షులు యాద ఆశోక్ గుప్తా ప్రధాన కార్యదర్శి బిలకంటి రాజు పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉచిత కాశీ యాత్ర దేశంలోని ఏ సంస్థ చేపట్టలేని ప్రథమ ప్రాజెక్ట్ పేద ప్రజల కొరకు ప్రతినెల ఉచిత కాశీయాత్ర శ్రీకాశీ ఆశ్రయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మార్చ్ 25వ తేదీనుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉచితంగా కాశీయాత్ర 9 రోజులు సకల సదుపాయాలతో రానుపోను రైలు టికెట్లు మరియు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.ఇప్పుడు వెళ్ళె 45 మందికి ఉచితంగా కాశీయాత్ర 9 రోజులు సకల సదుపాయాలతో రానుపోను రైలు టికెట్లు మరియు ఉచిత వసతి భోజనం ఏర్పాట్లను వినియోగించుకుంటారు.ఇప్పటి వరకు 110 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.ఇదేవిధంగా ముందుకు కొనసాగుతామని అన్నారు.ఈ సందర్భంగా గోడపత్రిక ను ఆవిష్కరించినారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాద ఆశోక్‌గుప్తా ,ప్రధాన కార్యదర్శి బిలకంటి రాజు ,ట్రెజరర్ యాద మంజుల , ప్రేమ్ గాంధీ,అనిల్‌కుమార్ గుప్తా ,జి.సునీత తదితరులు పాల్గోన్నారు.