ఖిలావరంగల్ కోటను సందర్శించిన వియత్నాం దేశస్థులు

 

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి23::

చారిత్రకమైన ఖిలావరంగల్ కోటను మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రం, ప్రెస్మీడియా
హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న వివిధ ప్రభుత్వ సంస్థల మీడియాలో పనిచేస్తున్న 26 మంది
వియత్నాం దేశస్థులు,
శనివారం తిలకించారు. కాకతీయ రాజులు పరిపాలించిన కాలం నాటి ఖిలావరంగల్ మధ్య కోటలోని శిల్పాలను
వియత్నాం దేశస్థులు స్టడీ టూర్లో భాగంగా తిలకించారు. వారికి స్థానిక గైడ్ కిరణ్ ప్రకాష్ కాకతీయుల కాలం నాటి చరిత్ర, విశేషాలను వారికి వివరించారు. వారు ఖిలావరంగల్ కోటలోని కీర్తి తోరణాలు, శిల్పాల ఆవరణతో పాటు గుండుచెరువు, ఖుష్మహల్, సింగారపు బావి, రాతి, మట్టికోట తదితర కట్టడాలను వారు ఆసక్తిగా తిలకించారు. అద్భుతమైన కళాఖండాలు, శిల్పసంపదలు, కోట దృశ్యాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాలలో
బంధించారు. వీరి వెంట హైద్రాబాద్ డాక్టర్ ఎంసీబీహెచ్ ఆర్ డి ఫాకల్టీ డాక్టర్ కే సురేష్ కుమార్, శ్రీనివాస్, డిపి ఆర్ ఓ ఆయుబ్ అలీ, వరంగల్ ప్రాంతీయ శిక్షణ కేంద్ర మెనేజర్ కుమార స్వామి, సిఐ మల్లయ్య, ఎస్ ఐ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వారు వెయ్యి స్తంభాల దేవాలయం, భద్రకాలి దేవాలయాలను సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking