పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించిచాలి

 

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం ఉత్తీర్ణత సాధనకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు బాధ్యతాయుతంగా కృషిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, మండల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల తో పదవతరగతి పరీక్షలపై అదనపు కలెక్టర్‌ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్న దృష్టా విద్యార్ధులను పరీక్షలకు సన్నద్దం చేయాలన్నారు. విద్యార్దులకు ప్రత్యేక శిక్షణ తరగతలు నిర్వహణతో పాటు ఏ ఏ పాఠ్యాంశంలో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ఆయ సబ్బెక్టుల ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణనిచ్చే విధంగా చూడాలన్నారు. విద్యార్ధుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించాలని వారితో ఉపాధ్యాయులు విద్యార్ధులకు సబ్బెక్టులో ఆర్ధం కాని విషయాన్ని గమనించి వారి సందేహలను నివృత్తి చేసి ప్రోత్సహించాలన్నారు. నూరుశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు, ప్రాధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking