అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం రావడం జిల్లాకే గర్వకారణం. —– జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ .

తేదీ 1-2-2024,
మెదక్ .

మెదక్ ప్రాజబలం న్యూస్:-

అంతర్జాతీయ స్థాయి లో బంగారు పతాకాన్ని , ఛాంపియన్ షిప్ ను సాధించిన నామ నితన్య సిరి ని అభినందించిన జిల్లా అదనపు కలెక్టరు రమేష్.

స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని అదనపు కలెక్టరు ఛాంబర్ లో గురువారం రెండవ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అండర్ 15 కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలో పాల్గొని జిల్లా కి బంగారు పతాకాన్ని, ఛాంపియన్ షిప్ ను సాధించిన నామ నితన్య సిరి నీ అభినందించారు .

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టరు రమేష్ మాట్లాడుతూ నితాన్య సిరి జిల్లాకే గర్వకారణమని కొనియాడారు.
నామ నితన్య సిరి యువతకు ఆదర్శం అన్నారు .

కోచ్ నగేష్ మాల్లురి మాట్లాడుతూ రెండవ అంతర్జాతీయ స్థాయిలో, జరిగిన కరాటే పోటీలు హైదరాబాద్ లోని సరుర్ నగర్ లో ఉన్న, ఇండోర్ స్టేడియం లో జనవరి 28 న జరిగియని, అంత్జాతీయ అండర్ 15 కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలలో 30 దేశాలనుంచి దాదాపు 3000 మంది పాల్గొన్నారని,మన మెదక్ జిల్లా నుంచి మెదక్ పట్టణం లో ఉన్న గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న నామ నితన్య సిరి ,మాస్టర్ నగేష్ మల్లురి ,దినకర్ ల అధ్వర్యంలో శిక్షణ పొంది, పోటీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినదన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో అండర్ 15 కరాటే బ్లాక్ బెల్ట్ లో బంగారు పథకం , ఛాంపియన్ షిప్ రావడం సంతోషం గా ఉందనీ తల్లి తండ్రులు పద్మ, శ్రీనివాస్ లు సంతోషం వ్యక్తం చేశారు .
ఈ కార్యక్రమం లో D.W.O అధికారి బ్రహ్మజి, పద్మ లత, అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking