ఖమ్మం ప్రతినిధి జూలై 03 (ప్రజాబలం) ఖమ్మం ఐడిఓసి సమావేశ మందిరంలో సోమవారం ‘గ్రీవెన్స్ డే లో అర్జీదారులను నుండి పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందనలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్య నిమిత్తం దరఖాస్తులను ఎండార్స్ చేశారు. ఖమ్మం నగరంకు చెందిన మెండె వెంకటేశ్వర్లు తనకు రఘునాధపాలెం మండలం కోయచెలక రెవెన్యూ సర్వేనెం.193/ఆ/4 నందు 1.00 ఒక ఎకరం భూమి కలదని అట్టి భూమిలో కెజిబివి పాఠశాల రఘునాథపాలెం క్రీడా ప్రాంగణంకు కేటాయించినట్లు తెలుసుకొని తెలంగాణ హైకోర్టు, హైద్రాబాదు నందు రిట్‌పిటీషన్ వేయగా, వారు తీర్పు వెలువరించారని, అట్టి తీర్పు ప్రకారం మా భూమిని సర్వేచేయించి తమ భూమికి హాద్దులు నిర్ణయించగలరని సమర్పించన దరఖాస్తును తగు చర్య నిమత్తం సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏ.డికి సూచించినారు. కూసుమంచి మండలం, నాయకన్ గూడెంకు చెందిన ఉల్లోజు వెంకటనారాయణ తాను ఎస్సీ కులమునకు చెందిన వాడనని, కూలీచేసి జీవనం సాగించడం జరుగుచున్నదని తనకు ఎలాంటి ఇంటి స్థలం కాని, భూమి కాని లేదని తనకు దళితబంధు పథకం మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును, తగు చర్య నిమిత్తం ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌కు సూచించారు. ఖమ్మం నగరంకు చెందిన కె.నక్షత్రసాయిని తాను 7 వతరగతి చదువుచున్నానని, తనకు తల్లిదండ్రులు లేరని తనకు శ్రీనివాసనగర్ గుట్టల బజార్ సెయింట్‌జోసెప్ హైస్కూల్ నందు 1 నుండి 10 వ తరగతి వరకు ఉచిత అడ్మిషన్ లభించడం జరిగినదని, హాస్టల్ వసతి లేకపోవడం చేత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుచున్నదని, తనకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సాంఫీుక సంక్షేమ శాఖాధికారికి సూచించారు. సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామంకు చెందిన పోలెపాక అనిత తన కుమార్తె పోలేపాక లేఖనకు గురుకుల పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఆర్‌సిఓ ఎస్సీ వెల్ఫేర్ అధికారికి సూచించారు. అష్టగుర్తి ప్రభుత్వ జడ్పీఎస్‌ఎస్ హైస్కూల్ నందు 8 వ తరగతి చదువుతున్న టి.సంజీవని తనకు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో ఖాలీఉన్న చోట అడ్మిషన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం సూచించినారు. కొణిజర్ల మండలం మల్లుపల్లి గ్రామంకు చెందిన దరావత్ శ్రీను తాను 90 శాతం అంగవైకల్యం కలిగిన గిరిజనుడనని, తను సాగుచేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కొణిజర్ల ఎంపిడిఓకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంకు చెందిన చామకూరి గోవర్దన్ తన కుమార్తె చామకూరి కుస్మీత పుట్టుకతో మూగ, చెవుడు వైకల్యం ఉందని, వికలాంగలు పించను మంజూరు చేయగలరని సమర్పించన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి డిసబుల్డ్ పెన్షన్ డిపిఎంకు సూచించారు.
వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు ‘‘గ్రీవెన్స్‌డే’’లో పాల్గొన్నారు.
Next Post