మహిళల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు

జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్రజ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించి వార్డులు,ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ…మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఆరోగ్య మహిళా కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉ చితంగా ఇవ్వడం జరుగుతుందని,ఆరోగ్యం కొరకు పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, వైద్యులు,సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking