ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 25:
విజ్ఞాన ప్రదర్శనలతో విద్యార్థులలో సృజనా త్మకశక్తి పెరుగుతుందని డి ఆర్ డి ఓ శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ అన్నారు. తార్నాక నారాయణ పాఠశాలలో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సైన్స్, గణితం, పర్యావరణం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి విద్యార్థులు తయారు చేసిన నమోనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయ్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకో వాలన్నారు. ఏ అంశంలోనైనా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడం నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొనేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్‌లో దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జిఏం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, పట్టుదలతో జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అంతరిక్షంలో ఉన్న గ్రహాల ద్వారా ఎలాంటి ఉపయోగాలు తెలుసుకునే విధంగా చేసిన నమూనాలు చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్, హై స్కూల్ ఆర్ అండ్ డి మనోహర్ రెడ్డి, మహేశ్వరి, మీనా, హై స్కూల్ కోఆర్డినేటర్ ఆజాద్, ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ నూర్, హై స్కూల్ ఏడి సురేష్, సరిత, ఏఓ మహేందర్, నరేష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు