దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా పాపన్నపేట
28.09.2024:
శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ,కమిషన్ సభ్యులు ఏడుపాయల దుర్గాభవాని మాత దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. అంతకుముందు ఆలయ పూజారులు పూర్ణకుంభం తో, పూలమాలవేసి ,శాలువాతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తోపాటు సభ్యులు రాంబాబు నాయక్ , లక్ష్మీనారాయణ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.