ఎస్సీ, ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలి

 

అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి

ఎస్సీ, ఎస్టీ పెండిగ్ కేసులు సమస్యలు పరిష్కరించాలి

ఎస్సీ, ఎస్టీల పై దాడులు అరికట్టాలి

ప్రతి నెలలో పౌర హక్కుల రోజు ను నిర్వహించాలి

ప్రతి మూడు నెలలకు ఒకసారి మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించాలి

అంబేద్కర్ విగ్రహం పై దాడులు చేసిన వారిని శిక్షించాలి

మెదక్ పట్టణం లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలి

మెదక్ పట్టణం లోని ఎస్సీ, ఎస్టీ దుకణ సముదాయాన్ని బినామీల నుంచి రక్షించాలి

గౌతోజిగూడ లో సహపంక్తి భోజనం ఏర్పాట్లు చేయాలి

ఎస్సీ, ఎస్టీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి

జిల్లా ల్యాండ్,అట్రాసిటీ కేసుల సమీక్ష సమావేశం లో

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
28.09.2024:

కలెక్టరేట్లో శనివారం ల్యాండు, అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య,కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ ,శంకర్,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి,అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఎస్సీ అభివృద్ధి అధికారి …. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ
ఎస్సీ, ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలని, ఎస్సీ,ఎస్టీ ల పెండింగ్ కేసుల పరిష్కరించాలని ,ఎస్సీ, ఎస్టీ లపై దాడులు అరికట్టలని, బాధితులకు నష్ట పరిహారం త్వరిత గతిన అందించాలని,ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరుపాలని,మెదక్ పట్టణం లో ఎస్సీ, ఎస్టీ దుకాణ సముదాయాలపై దృష్టి సారించాలన్నారు.
మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పున:ప్రతిష్టించాలన్నారు. అంబేద్కర్ విగ్రహాల దాడులను సహించేది లేదన్నారు.
గౌతోజీగుడ లో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని, అక్కడ సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ ఎస్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను పగడ్బందీగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగ తరఫున విశేష కృషి చేస్తున్నట్లు ఇందుకుగాను సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించి తద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సమావేశం లో ప్రజలనుంచి వినతులు, దళిత సంఘాల సభ్యులు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అన్ని సమస్యలను వారం లో పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అదికారులు, ఆర్డీవోలు, మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘం నాయకులు తదితరులు,పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking