నాణ్యమైన గుణాత్మక విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాల చేరుకోవాలి
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం
ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు
మెదక్ తెలంగాణ సోషల్ వెల్ఫే రెసిడెన్షియల్ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ..
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
28.09.2024:
నేటి బాలలే రేపటి పౌరులు నాణ్యమైన గుణాత్మక విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాల
చేరుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య విద్యార్థినులకు సూచించారు.
శనివారం ఎస్సీ ఎస్టీ కమిషన్ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకయ్య పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య
అందుతుందని విద్యార్థులు సామర్థ్యాలను మెరుగుపరుచుకుని తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి
సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని
హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై రెగ్యులర్ గా చెక్ అప్ చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్,లక్ష్మీనారాయణ, శంకర్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,అదికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.