లోక్ ఆదాలత్ ల ద్వారా కేసుల సత్వర పరిష్కారాలు. జిల్లా జడ్జి ప్రతిమ .

 

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు రాజీ ద్వారా వారిపై కేసులు సత్వరంగా పరిష్కరించుకునేందుకు లోకదాలత్ లతో మాత్రమే సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా జడ్జి బి ప్రతిమ తెలిపారు. జాతీయ లోక్ అదాల లో భాగంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ లో లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై జడ్జి మాట్లాడారు. లోక్ అదాలతులపై ప్రజల్లో అవగాహన పెరిగి అపోహలు తగ్గుతున్నాయని ప్రతి లోకదాలత్ లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్ విజయానికి సహకరించిన అందరికీ జిల్లా జడ్జి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ లోకదాలత్ లో పోలీస్ అధికారులు ఎక్కువ సంఖ్యల కేసుల పరిష్కారానికి కృషిచేసా రని, పోలీస్ అధికారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లు సత్ఫలితాలను ఇస్తున్నాయని, వీటికి న్యాయవాదుల పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకటేష్ మాట్లాడుతూ లోక్ ఆదాలత్ లు,వాటి పనితీరు గూర్చి వివరించారు. అనంతరం జిల్లా జడ్జి మోటారు ప్రమాద పరిహారం కేసు పరిష్కరించి లోకదాలత్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వెంకటేష్, సాధన,కుమార్ వివేక్,నీరజ, లక్ష్మీకుమారి శ్రీలేఖ ,మెజిస్ట్రేట్లు,ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు కక్షి దారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking