– జిల్లా అధ్యక్షులుగా బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్
ప్రజా బలం దినపత్రిక మెదక్, సెప్టెంబర్ 28,
తెలంగాణ మనముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా కార్యవర్గం శనివారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయింది. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా రాగి రాములు ముదిరాజ్, చిమ్మనమైన శ్రీనివాస్ ముదిరాజ్, ప్యాట స్వామి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా తలారి సంతోష్, కార్యదర్శులుగా కొడిచరపు శివరాజ్, వదలపర్తి శ్రీనివాస్, తొంటవాలి యాదగిరి, సంయుక్త కార్యదర్శులుగా పోచన్నోల గణేష్ , భూమ కిషన్ , కోశాధికారిగా అబ్బరబోయిన గంగారాములు, అధికార ప్రతినిధిగా పాపన్నపేట శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా భీమరి కుమార్ లు ఏకగ్రీవం కాగా నూతన కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ముదిరాజులను బిసి డి నుంచి ఏ లోకి మార్చాలని, అదేవిధంగా కులగనన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శులు సలేంద్ర శివయ్య, మద్దెల సంతోష్, ముశెట్టి కిష్టయ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.