ఖానాపురం స్వయంభూ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం కార్యక్రమం మొదలు పెట్టినా దేవుడి పూజలతో ఆరంభిస్తాం. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి, యుపీహెచ్ కాలనీలో కొలువైన స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి వారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఆహ్వానం మేర వచ్చి పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు ఖానాపురం స్వయంభూ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నామ ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి ఆశీస్సులుంటే మనం అన్ని రంగాల్లోనూ ముందుకు పోవచ్చునని నామ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని ఆయన చెప్పారు. భగవంతుడితోపాటు ఖమ్మం జిల్లా ప్రజలు అక్కా, చెల్లెళ్లు, అన్నదమ్ముల ఆశీస్సులు నాకుండాలని నామ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నగర మేయర్ నీరజ డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం సుడా మాజీ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి ఆలయ పాలకవర్గ చైర్మన్ బొల్లి కొమరయ్య సహా తదితరులు ఉన్నారు
