ప్రభుత్వ ఉద్యోగులు ఐక్యమత్యంతో పని చేయాలి
టి ఎస్ యు టి ఎఫ్ కార్యదర్శి చంద్రమౌళి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐక్యమత్యంతో తమ విధులను నిర్వహించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పేర్కొన్నారు.శనివారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో టీఎస్ యుటి ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయ విద్యారంగ అభివృద్ధికి నిరంతరం ఉద్యోగ సంఘం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చి క్రియాశీలక పాత్ర పోషించి ముందుకు సాగుతుందని అన్నారు. నిరంతరం ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందిస్తూ విద్యార్థులకు చక్కని విలువలతో కూడిన బోధనకు ప్రాధాన్యత ఇచ్చే సంఘములో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె నరసయ్య,లక్షెట్టిపేట మందెల అధ్యక్షుడు బండ శ్రీనివాస్,కోశాధికారి రాజలింగం,సీనియర్ నాయకుడు దిలీప్, దండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఇండ్ల మల్లేశం, ఉపాధ్యక్షుడు శనిగారపు సతీష్,కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.