ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామం లోని శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కుందారం ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని పరిశీలించిన వివేక్ వెంకట స్వామి సీసీ రోడ్లు,కంపొండ్ వాల్ కు ఫండ్స్ కావాలని కోరిన వైద్య సిబ్బంది
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే,కుందారం, కిష్టాపూర్ గ్రామంలో పలు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ అవసరమైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారుచేయాలని అధికారాలను ఆదేశించిన ఎమ్మెల్యే కుందారం కిష్టాపూర్ గ్రామాల మధ్యగల పెద్దవాగుపై హై లెవెల్ వంతెన బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.