మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 27:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఇరవై నాలుగు గంటలు పని చేసే విధంగా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల సౌకర్యార్థం ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050 కు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డబ్బు తరలింపులు, ఇతర ప్రలోభాలకు గురి చేసినట్లు ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందచేయాలని, అందుకు సంబంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.