ప్రత్యేక మహిళా గ్రామ సభలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 25:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారి ఆదేశానుసారము ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక మహిళ గ్రామ సభలో నిర్వహించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన మహిళా శక్తి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక మహిళా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలలో గ్రామపంచాయతీలలో మహిళా సంఘ సభ్యులు స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక మొత్తంలో పాల్గొనడం జరిగింది. గ్రామ సభలలో ఎజెండా అంశాలుగా ఇదిగో అంశాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు సంఘంలో లేని మహిళలను గుర్తించడం వారిని సంఘాలలో చేర్పించడం, మైక్రో ఎంటర్ప్రైజెస్ని, గుర్తించి వాటిని ప్రోత్సహించడం, కుట్టు కేంద్రాలు ఏర్పాటు, పాడి పరిశ్రమ ఏర్పాటు, పౌల్ట్రీ, మదర్ యూనిట్ల ఏర్పాటు, మిల్క్ పార్లర్లు, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ మహిళా క్యాంటీన్లు కుట్టు కేంద్రాలు ఏర్పాటు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వంటి తదితర యూనిట్లను ఎంపిక చేయుటకు గాను గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలలో స్వయం సహాయక సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని విద్యార్థులందరికీ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించడంలో సఫలీకృతులయ్యారు. రెండవ జత బట్టలు కూడా కుట్టడానికి తగు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా క్యాంటీన్లోని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ తెలంగాణ సచివాలయంలో రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే అందులో ఒకటి మేడ్చల్ మహిళ సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం ఒకింత జిల్లాకు గుర్తింపు అని చెప్పవచ్చు, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు బస్టాండ్లు రైల్వే స్టేషన్ లో హాస్పిటల్స్ టూరిజం ప్రాంతాలు దేవాలయాలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి పూర్తిగా మహిళచే నిర్వహించబడే స్టాల్స్ కు ఆదరణ లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈనెల వరకు స్వయం సహాయక సంఘాల సభ్యుల నుండి లబ్ధిదారులను గుర్తించడం పూర్తిచేసి జులై మాసము నుండి గ్రౌండింగ్ చేయడానికి తగు ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. కొత్తగా ఏర్పడిన సంఘాలు సభ్యులకు గుర్తించి వారిని గ్రూపులలో చేర్పించడం బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం వాటిని ఆన్లైన్లో నమోదు చేయించడం, పుస్తకాలు నిర్వహణకు బుక్ ఈ పర్సన్ గుర్తించి వారిని ట్రైనింగ్ పూర్తి చేయడం ఇవన్నీ కూడా 100 రోజుల కార్యచరణ ప్రణాళికలు భాగంగా చేర్చడం జరిగింది. మన జిల్లాలో ఇంకా 1948 మందిని సభ్యులను గ్రూపులలో చేర్పించడానికి టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో 16 మీసేవ కేంద్రాలు మహిళా శక్తిల భాగంగా మహిళా సంఘం సభ్యులతో ఏర్పాటు చేయించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి. జిల్లాలో గల 118 వివో ల సభ్యులకు2613 యూనిట్లను 3013 మంది సభ్యులకు ఇప్పించుటకు తగు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది…

Leave A Reply

Your email address will not be published.

Breaking