మెదక్ జూన్ 25 ప్రజాబలం న్యూస్ :-
బాలిక విద్యను బలోపేతం చేయడమే కేజీబీవీ లక్ష్యం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మంగళవారం రేగోడు కేజీబీవీ ని పరిశీలించారు.విద్యార్థినిలకుఅందుతున్నబోధనా విధానాన్ని,మెనూ పరిశీలించారు.ముందుగా విద్యార్థినుల ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు .అనంతరం విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాలను మెనూ స్వయంగా పరిశీలించారు.స్టోర్ రూమ్ను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.కూరగాయలు పప్పు దినుసులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత ప్రాథమిక స్థాయిలలో. ప్రాథమిక స్థాయిలో బోర్డింగ్ సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలోని వెనుకబడిన సమూహాల బాలికలకు నాణ్యమైన విద్య సాధ్యమయ్యేలా మరియు అందుబాటులో ఉండేలా చేయడం (KGBV) కేజీబీవీ యొక్క లక్ష్యంచెప్పారు.విద్యార్థినిల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని నాణ్యమైన మెనూ అందించాలని కేజీబీవీఉపాధ్యాయులుసమయపాలన పాటించాలని తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.