ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఏప్రిల్ 8
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించుటకు
వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డి ఈ ఓ వాసంతి, డి ఆర్ డి ఓ కౌసల్యాదేవిలతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అమ్మా ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితంగా పనులు చేపట్టాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో
వేసవి సెలవులు ముగిసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన పూర్తి కావాలని అన్నారు. కమిటీల ఆధ్వర్యంలో 25వేల రూపాయల లోపు చిన్న చిన్న పనులను మరమ్మతులు టాయిలెట్లు విద్యుత్ సరఫరాల ఇబ్బందులు తదితర మే 10 లోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పని ప్రారంభించే, you పూర్తయ్యే సమయాన్ని ఖచ్చితంగా పేర్కొనాలన్నారు. రాగల 15 రోజుల్లో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో విద్యుత్, నీరు, టాయిలెట్ మొదలగు పనులన్నీ పూర్తి కావాలన్నారు.
ఈ సమీక్షలో లీడ్ బ్యాంక్ ఆఫీసర్ హవేలీ రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిఇలు, ఏఈలు, మండల ఎడ్యుకేషన్ అధికారులు, ఏపీఎంలు, ఎమ్మెన్ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.