యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 8:

కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామ పంచాయతీలోని రైస్ మిల్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అధ్యక్షతన ఆదివారం యువజన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో గెలుపొందిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రావుల అనిల్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు చల్లగొండ రాజ్ కుమార్, కాసిపేట మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ సొప్పరి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు ఇమ్ము, జిల్లా కార్యదర్శులు భుక్య సాయి పున్నం, భోగ శ్రావణ్ లను సన్మానించారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన అభ్యర్థులను కష్టపడి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కష్టపడ్డవారిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని వారికి ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ లు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. జిల్లా అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ ఎన్నికలలో కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు బాల్ మంచ్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ బాబు, మైనార్టీ మండల అధ్యక్షుడు శాకీర్, యాప గ్రామ అధ్యక్షుడు చారి, ధర్మరావుపేట గ్రామ అధ్యక్షుడు గోపే శ్రీను, కన్నక రాజు, చిలుకయ్య, పంబల తిరుపతి, శ్రీధర్, నరేష్, రాజు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking