తల్లి తన కుమారులైన డాక్టర్ రాజేష్ కె గట్లేవార్ M.D. అనస్థీషియాలజిస్టు మరో కుమారుడు ముంబై హెచ్ పి సి ఎల్ లో పనిచేస్తున్న ఇంజనీర్ ముఖేష్ కె గట్లేవార్ పైసికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐ ఆర్ నమోదు చేసింది.తన కుమారులు తనను రాయడానికి వీలుకాని భాష లో దుర్భాషలాడి అవమానించినందున తాను తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీలో డాక్టర్ రాజేష్ మరియు సికింద్రాబాద్ సఫిల్‌గూడలో ముఖేష్ నివాసముంటున్నారు . 82 సంవత్సరాల వయస్సు గల తల్లిని ఆమె కుమారులు వేధించడమే కాకుండా ఆమె అన్ని వస్తువులను తీసుకోవ డానికి ఆమెను అనుమతించలేదు. పోలీసు పెట్రోలింగ్ వారు అవసరమైన ఆమె వస్తువులను ఆమెకు తిరిగి ఇవ్వమని 3-4 సార్లు 17.11.24 న హెచ్చరించిన దరిమిలా పోలీసు పెట్రోలింగ్ సమక్షంలో ఆమె వస్తువులను తీసుకోవడానికి అనుమతించారు. డాక్టర్ రాజేష్ కె గట్లేవార్,ముఖేష్ కె గట్లేవార్‌లపై తగు చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీస్ వారిని కోరింది.