జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవించండి -బెల్లంపల్లి ఏసీపి రవికుమార్

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 9 :

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ పిలుపునిచ్చారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.శ్రీనివాస్,ఐపీఎస్ (ఐజి), మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్,ఐపీఎస్ ఆదేశాల మేరకు, సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఊరు మందిమర్రి గ్రామ నివాసుడైన మావోయిస్టు పార్టీ సభ్యుడు బబ్బెర రవి ఇంటికి వెళ్లి ఆయన తల్లి లక్ష్మిని కలిశారు. ఆమె ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 24 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె కుమారుడిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమెకు కొన్ని నిత్యావసర సరుకులు,25 కిలోల బియ్యం, దుప్పట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే తప్ప, సాధించింది ఏమి లేదన్నారు. జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన చికిత్సనందిస్తామని హామీ ఇచ్చారు. ఏలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని పేర్కొ న్నారు. ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు శోకం మిగిల్చారని పేర్కొన్నారు. వారు అక్కడ అడవిలో ఉండి ఇక్కడ కుటుంబ సభ్యుల పరిస్థితులను ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదని, ఫలితంగా ఇక్కడి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శశిధర్ రెడ్డి, మందమర్రి ఎస్సై రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking