అణగారిన వర్గ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 9 డిసెంబర్ 2024
మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కౌన్సిలర్ నవీన్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కంబగళ్ల ధనరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రూపా రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సునీత రాజకుమార్, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ రావుల సంయుక్త ప్రకటనలో తెలియ జేసిన విషయం: ఇందిరమ్మ ఇళ్ల పేరిట బడుగు బలహీన అణగారిన వర్గాలకు గూడు కల్పించాలనె ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం అని, గతంలో కూడా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పేదలకు మరియు అణగారిన వర్గాలకు గూడు కల్పించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళను స్వాగతిస్తూనె లబ్ధి దారుల ఎంపిక పట్ల పూర్తి పారదర్శకతతో కూడిన అర్హులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు లబ్ధిదారుల ఎంపికను వార్డు సమావేశం నిర్వహించి ఆ వార్డు సమావేశంలోనే అందరి సమక్షంలో ఎంపిక చేయాలని కోరుతున్నాము. పారదర్శకత లేకపోయినా అర్హుల పట్ల వివక్షత చూపినా, మా పార్టీ తరఫున వివక్షకు గురి అయిన అర్హులకు న్యాయం జరిగే వరకూ చట్టబద్ధంగా ఆందోళన చేస్తాం అని ఈ సందర్భంగా తెలియ చేయడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking