ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 9 :
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు
సింగరేణిలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో నుంచి 33 శాతం వాటాను ఈ నెల 12న చెల్లించేందుకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2024 ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా చెల్లిస్తారని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు 33% లాభాల్లో వాటా చెల్లించాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు యాజమాన్యం అంగీకరించిందని దివారం ఏఐటియూసి నాయకులు తెలిపారు.