గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 9 డిసెంబర్ 2024
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మణికొండ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల
కౌన్సిలర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి అల్కపూర్, వెంకటేశ్వర కాలనీతో సహా మొత్తం మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ పరిధిలో ఇందు గలడన్దు లేవనే విధముగా దోమలకు నిలయమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నవని, అందు నిమిత్తం మునిసిపల్ కమిషనర్ ను ప్రత్యక్షముగా కలసి వివరిద్దామని మునిసిపల్ ఆఫీసుకు రాగా, ప్రజలను కలిసే ఆఫీసు సమయంలో సదరు కమిషనర్ పనిని పక్కన బెట్టి పరెడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ తలపెట్టిన మీటింగ్ కు జనాలను తరలించే పనిలో నిమగ్నం అయి ఉన్నందువల్ల పిర్యాదును ఇన్వర్డ్ లో ఇవ్వమని పురమాఇంచడం వలన భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున పిర్యాదు ఇవ్వడం జరిగినదని బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ పరిచారు ఇట్టి కార్యక్రమంలో కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, ఏర్పుల శ్రీకాంత్, షేక్ ఆరీఫ్, యాలల కిరణ్, బొడ్డు శ్రీధర్, సుమ, ప్రసాద్, ఆశఫాక్ అలీ, కుమార్, అహ్మద్, శమీం, అహ్మద్, సాయి తది తరులు పాల్గొన్నారు.
Next Post