గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 9 డిసెంబర్ 2024
మణికొండ మునిసిపల్ పరిధిలోని పాయినేర్ ఎస్టేట్ ప్రజలు తాము ఎదుర్కుంటున్న ఇతి భాధలలో ముఖ్యంగా వాహనాలను అదుపులో పెట్టడానికి రహదారి స్పీడ్ బ్రేకర్ ల ఏర్పాటుతో పాటు పిల్లలు పెద్దలు సాయంత్రం సమయాలు గడుపడానికి ఉన్న ఉద్యానవనానికి చుట్టూతా ఉన్నతమైన గడిలాగ గోడ ఏర్పాటు చేయాలని వినతి గావిస్తూ, పందెం వాగు కలుషితo కావడం వలన దోమల బెడద ఎక్కువగా ఉన్నందువల్ల దోమల నివారణకు సరి అయిన ఏర్పాట్లు చేయాలని ఫాయినేర్ ఎస్టేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ ఆరీఫ్, కోశాదికారి ప్రసాద్, కుంబగల్ ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, అహ్మద్, శమిoల, ఆశక్ అలీ, కుమార్ ఆధ్వర్యంలో మణికొండ మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు ఇవ్వడం జరిగింది