కార్వాన్ ప్రజాబలం ప్రతినిధి : నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ డిస్ట్రిక్ట్, పర్యావరణ పరిరక్షణ సేవా సమితి ఆధ్వరంలో బ్లాక్ లెవెల్ క్రీడలు నిర్వహించారు. ఈ నెల పదో తారీకు నుండి 13వ తారీకు వరకు నిర్వహించిన ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, కరాటే మల్కం వంటి క్రీడలను నిర్వహించారు. భారత అభ్యధయ హైస్కూల్లో కబడ్డీ, కరాటే పోటీలు, జియాగూడ మున్సిపల్ గ్రౌండ్లో కొక్కో వాలీబాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ ఎంకే శ్రీ బాలాజీ, మల్కం కోచ్ పాల్ సింగ్, కబడ్డీ కోచ్ జి నరేష్, వాలీబాల్ కోచ్ ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.