దుబాయి లో శ్రీ లక్మీ నరసింహ స్వామి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సంగారెడ్డి ఆధ్వర్యంలో 75 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎందరో మహానీయుల ధన,మాన,ప్రాణ త్యాగాలపలితముగా సర్వసత్తాక గణతంత్ర దేశముగా ఏర్పడిన మన భారత దేశ 75 వ భారత గణతంత్ర దినోత్సవములను ఈ రోజు మనం ఈ దుబాయి లో జరుపు కోవడం మనందరికీ గర్వకారణమని,మరియు మన దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటిచెప్పేవిధముగా కృషిచేయవలసిన భాద్యత మనందరిపై నుందని అధ్యక్షులు పి.రాములుగౌడ్‌ అన్నారు.
సంగారెడ్డిలోని శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ప్రెండ్స్‌ అసోసియేషన్‌ మిత్రబృందం అసోసియేషన్‌ అధ్యక్షులు పిల్లిగుండ్ల రాములుగౌడ్‌ సారధ్యములో(12గురు మిత్రబృందం కుటుంబ సభ్యులతో కలిసి
with family) UAE  లోని దుబాయి దేశము ను ఐదు రోజుల యాత్ర లో బాగముగా దుబాయిలోని బుర్జ్‌ ఖలీపా,దుబాయిఫ్రేమ్‌ హాలిడే ఇంటర్‌ నేషనల్‌ హోటల్‌ లయందు భారత 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనముగా జరుపు కున్నారు.
ఈ కార్యక్రమములో అసోసియేషన్‌ కార్యదర్శి శంకరివిజయెందర్‌ రెడ్డి,కోశాధికారి మంగళపర్తి వెంకటేశం,సలహాధారులు నాయికోటి రామప్పలతోపాటు సభ్యులు అనంతరావ్‌ కులకర్ణి,పి.రాంగోపాల్‌,జి.వెంకన్న,యల్‌.మల్లేశం,వెంకటేశ్వర్‌ రావ్‌,ఆర్‌. ప్రభాకర్‌ రెడ్డి,జే.ప్రభాకర్‌ మరియు యస్‌.క్రిష్ణ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking