మార్చి 8 నుంచి పండితాపురంలో శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ జాతర

 

కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఇల్లందు ప్రతినిధి ఫిబ్రవరి 25 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం మార్చి నెల ఎనిమిదో తారీకు నుంచి 11 వ తారీకు వరకు కొమ్మి నేపల్లి- పండితాపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మహాశివరాత్రి తర్వాత తొమ్మిదవ రోజున ఆనవాయితీ ప్రకారం జాతర కార్యక్రమం ప్రారంభమగునని, మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు శివాలయం ప్రాంగణంలో జాతరకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి వందల సంవత్సరాల క్రితం నుండి కొమ్మినేపల్లి- పండితాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది పాల్గొనమాసం శుద్ధ ఏకాదశి నాడు అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుందని, ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే జాతర కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి కూడ దాదాపు 50 వేల మందికి పైగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్లు సూర్యాపేట జిల్లాల నుండి భక్తులు పాల్గొంటారని తెలిపారు. గతంలో ఇక్కడ ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందని, మా చిన్నతనంలో దూర ప్రాంతాల నుండి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారని గుర్తు చేశారు.

మార్చి 8 వ తారీకు స్వామివారి గుడికి తోరణాలంకరణ, 9వ తారీకు కళ్యాణం, పదవ తారీకు ఊరేగింపు కార్యక్రమం, 11 వ తారీకు పూర్ణాహుతి కార్యక్రమం , సందర్భానుసారంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మల్లి బాబు యాదవ్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో బానోతు నరసింహ నాయక్ మేకల మల్లికార్జున రావు, పూజారి రామలింగేశ్వర శర్మ, మేకపోతుల మహేష్, భూక్యా నాగేంద్రబాబు పాడిబండ్ల ప్రసాదు జలగం శ్రీను శీలం పుల్లయ్య బండి లక్ష్మీ నర్సు,బండి ఉపేందర్,గుగులోత్ రవిబొమ్మగాని పిచ్చయ్య, తురక బిక్షం బండి ఎల్లయ్య, డేరంగుల తిరపయ్య, చల్ల మల్లయ్య శివరాత్రి చిన్నబాబు, దొడ్ల వెంకన్న, దరావత్ నాగరాజు, దాసరి గురేష్ అనంతల శ్రీను, చల్ల గోపి చిర్రా అచ్చయ్య కుంచపు కృష్ణ, బొమ్మ గాని శ్రీను చల్ల వీరన్న సూతగాని వీరన్న, వేముల వీరబాబు బత్తుల వీరబాబు బుర్ర రాజాలు, సురభి మంగయ్య, బోనెపల్లి బాబు, తొండల ముత్తయ్య, పల్లె ఉపేందర్ ఉన్నాం ప్రభాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking