ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 07 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని శ్రీ సీతా రాముల కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు మాట్లాడుతూ…శ్రీ సీతా రాముల కళ్యాణం సందర్భంగా ముందు రోజున పాల పోరుక కార్యక్రమం చెయ్యటం జరిగింది,కళ్యాణం రోజున రోజు వారిగా హనుమాన్ గుడి వద్ద పుజాలు చేసి,శ్రీ సీతా రాముల గుడి వద్ద నుండి హనుమాన్ మాలధారణ భక్తులు,గ్రామంలో ప్రజలు,చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో బయలుదేరి గోపతి తిరుపతి ఇంటి నుండి శ్రీ రాముడు,లక్ష్మణుడు,ఆంజనేయ స్వామి ప్రతిమలను,మరియు సుద్దపల్లి వేంకటేశ్వర్లు నుండి ఇంటి సీతా ప్రతిమలను ను, తలంబ్రాలు,పుస్తెలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆట పాటలతో శ్రీ సీతా రాముల గుడి వద్దకు తీసుకెళ్లి,శ్రీ సీతా రాముల కళ్యాణం కళ్యాణంలో భాగంగా వరుడు సైడ్ గోపతి కవిత తిరుపతి,వధువు సైడ్ సుద్దపల్లి పావని వేంకటేశ్వర్లు,హనుమాన్ మాలధారణ స్వాములు గ్రామంలో భక్తులు కలిసి కళ్యాణం ఘనంగా జరిపించడం జరిగింది,అనంతరం కళ్యాణం వచ్చిన భక్తులు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.సాయంత్రం హనుమాన్ మాలధారణ భక్తులుతో, గ్రామంలో ప్రజలతో శ్రీ సీతా రాముల కళ్యాణం సందర్భంగా శోభ యాత్ర ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లో గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో భక్తులు,హనుమాన్ మాలధారణ భక్తులు,పాల్గొనడం జరిగింది.