రేషన్‌ కార్డు సమస్యలను అసిస్టెంట్‌ సివిల్‌ సప్లైస్‌ ఆఫీసర్‌ దృష్ఠికి తీసుకువెళ్ళిన శ్రీకాంత్‌ యాదవ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో డివిజన్ల వారిగా పాదయాత్ర చేసి ప్రజాసమస్యలని తెలుసుకుని సమస్యలల్లో రేషన్‌కార్డులు సంబంధిత అధికారులు ఇవ్వడంలో జాస్యం జరుగుతుందని ప్రజలు మాదృష్ఠికి తీసుకోచ్చారు.ఈ సమస్యను గురువారంనాడు , గోషామహల్‌ నియోజకవర్గంలో రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి గోషామహల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి అసిస్టెంట్‌ సివిల్‌ సప్లైస్‌ ఆఫీసర్‌ మరియు సూపరింటెండెంట్‌ను కలిసి వారి దృష్ఠికి తీసుకుని వెళ్ళి పరిష్కారం అయ్యేవిధంగా చేయాలని కోరడంతో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్‌ యాదవ్‌ టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై గోషామహల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు తెలిసే విధంగా పనిచేస్తున్నాం. స్థానిక సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్ఠికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేవిధంగా పనిచేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌ యాదవ్‌ టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌, (గోషామహల్‌ నియోజకవర్గం)ఎస్‌. ధన్‌ రాజ్‌ నగర ఉపాధ్యక్షుడు, కేడీసీసీడి. రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking