వరంగల్ తూర్పులో ఎస్సారెస్పీ కెనాల్ కు సంబంధించిన స్థలాల్లో అక్రమ డంపులు..
ముడుపుల మత్తులో అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు
(ప్రజాబలం) కాశిబుగ్గ ఫిబ్రవరి 14: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అక్రమ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. మొరమ్ అక్రమ రవాణా కు ఎస్ఆర్ఎస్పి కెనాల్ స్థలాన్ని అడ్డలుగా చేసుకొనీ అక్కడ డంప్పులు ఏర్పాటు చేసి అక్రమంగా మొరన్ని నిల్వ చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు వేల రూపాయలు అమ్ముకుంటున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దమ్మ గడ్డ నుండి వచ్చే కెనాల్ మీదుగా డిఎం అండ్ హెచ్ ఓ, ఫిల్టర్ బెడ్, పైడిపల్లి, సాయిబాబా టెంపుల్ కు వెళ్లే కాకతీయ కెనాల్ కు ఇరువైపులా ఉన్న దారి నీ మట్టి మొరం, కంకర, ఇసుక అడ్డాలు ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్న అటువైపుగా ఎస్సారెస్పీ అధికారులు గానీ, రెవెన్యూ శాఖ అధికారులు గానీ, పోలీసులు కానీ, కన్నెత్తి చూడకుండా ఉండడంలో ముడుపుల మాయాజాలం ఉండే ఉంటుందనేది స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా కాకతీయ కెనాల్ చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాలను కాపాడడంతో పాటు, గ్రామాల్లో అక్రమ మొరం రవాణా దందాను అరికట్టి అక్రమ మోరాం డంపులను తొలగించి మల్లి ఇలాంటి అడ్డలు ఎవరు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు తీసుకొవలని ప్రజలు కోరుకుంటున్నారు.