మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను పరిశీలించిన రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆఫీసర్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 9:
త్వరలో రాబోతున్న పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లో రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆఫీసర్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి కలెక్టరేట్ లో జరుగుతున్నా ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఢిల్లీ నుండి వచ్చినఎన్నికల పరిశీలకులు నవీన్ దుద్ది, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి కలెక్టరేట్ లో జరుగుతున్నా ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎం, వివి ఫ్యాట్, బ్యాలెట్ బాక్స్ ల పనితీరు ను ECIL ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను ఎన్నికల పరిశీలకులు కలిశారు.
ఈ కార్యక్రమంలో డి. ఆర్. ఓ. హరిప్రియ, తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking