పీవీకి భారతరత్న సముచితం

– తూప్రాన్ పరిరక్షణ సమితి
అధ్యక్షుడు
కే శ్రీనివాస్ చారి.

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

కీ.శే. పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతదేశ జాతీయ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సముచితమైన నిర్ణయం. భారతదేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సంస్కరణవాది పివి . దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా క్షీణించి భారత దేశ సమగ్రతకు ముప్పు వాకిళ్లుతున్న సంక్లిష్ట, సంక్షోభ సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అరుణ హత్యానంతరం పివి ప్రధాని అయ్యారు. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించుకోవడంలోనే అయన దూరదృష్టి అర్థమవుతుంది. 1991 – 92 సంవత్సరాలలో భారతదేశం చైనా కంటే దశాబ్ది ఆలస్యంగానైనా ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం పివి గారి వల్లనే సాధ్యమైంది.
సాధ్యమైందని సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు
కే శ్రీనివాస్ చారి అన్నారు. ఆర్థిక రంగంలో అప్పటివరకు ఉన్న సాంప్రదాయక విధానాలను కాదని నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు బాటలు వేయడంతో ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు భారత ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితం కాకలిగాయి. దాంతో భారతదేశ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల మీద అప్పటివరకు ఆధారపడిన దేశం సేవల రంగంపై దృష్టిని పెట్టింది. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభించి కొనుగోలు శక్తి పెరగడంతో విద్యా, ఆరోగ్య రంగాలు, మౌలిక సదుపాయాలు గ్రామ గ్రామానికి తరలేందుకు బాటలు వేయబడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం బాగా పెరిగింది. అభివృద్ధి పథకాల అమలులో అందరి భాగస్వామ్యం పెరగడం వల్ల తరతరాలుగా కొనసాగిన పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇతర దేశాల సైన్సు, టెక్నాలజీలు దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా పట్టణాలే కాదు పల్లెల మౌళిక స్వరూపం మారిపోయింది. రేడియో మరియు పత్రికల మీద ఆధారపడిన సమాచార ప్రసార వ్యవస్థ టీవీలు, కంప్యూటర్ల వైపు మళ్ళింది. ఆయన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, ప్రధానైనా పీవీ నరసింహారావు గారి దారిలో అడుగు వేయక తప్పలేదు. ఆర్థిక వ్యవస్థ వేగం ఉంచుకోవడంతో విదేశీ ఎగుమతులు కూడా బాగా పెరిగి మారకద్రవ్యం పెరిగింది. అయితే పివి గారు ప్రారంభించిన సంస్కరణలు ‘పూర్తిగా’ మానవీయ ముఖంతో లేవనే విషయం ఆ తర్వాత అమలులో, ఆచరణలో తెలిసింది. అయితే 90వ దశకంలో ఉన్న దారుణ అనివార్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించినప్పుడు పివి గారు చేసిన సాహసం మరెవ్వరూ చేసి ఉండేవారు కాదేమో! ఏదేమైనా నూతన ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పవచ్చు. మానవీయ ముఖంతో పివి గారి ఆశయాలు కొనసాగితే మరీ మంచిది.

Leave A Reply

Your email address will not be published.

Breaking