జూన్ 21న లక్షెట్టిపేట పట్టణంలో రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్ అన్న బహిరంగ సభ విజయవంతం చేయాలి

 

ప్రజాభలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 17 : జూన్ 21న లక్షెట్టిపేట పట్టణంలో రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్ అన్న బహిరంగ సభ ఉన్నందున,అట్టి సభ యొక్క వివరాలను వివరించేందుకు శనివారం స్థానిక దండేపల్లి అంబెడ్కర్ విగ్రహం ఎదురుగా వున్న కార్తీక్ షాప్ వద్ద బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య మాట్లాడుతూ … 9 ఏళ్ళ మోడీ పాలన, వారి సంక్షేమ పథకాల గురించి వివరించడానికి మరియు 9 ఏళ్ల తెరాస పాలన వైఫల్యాలను ప్రజలను తెలియచేసేందుకు మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మన లక్షెట్టిపెట పట్టణానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే మండల బీజేపీ శ్రేణులతో పాటు, చుట్టు పక్కల గల లక్షెట్టిపేట,దండేపల్లి హజీపూర్ మండల బీజేపీ శ్రేణులు, బీజేపీ అభిమానులు,మోడీ అభిమానులు, బండి సంజయ్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఇట్టి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోపాల్గొన్నవారు మండల ఇంచార్జ్ గుండ ప్రభాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్కె కార్తీక్ మండల కోశాధికారి గుండ రవీందర్ ఉపాధ్యక్షులు ఎంబడి సురేందర్ ముత్తినేని మల్లేష్ ,కిసాన్ మోర్స్ మండల అధ్యక్షులు వనపర్తి రాకేష్ ఉపసర్పంచ్లు దుమ్మని సత్తయ్య రాజు నాయక్ ముత్తే వెంకటేష్ ఎసి మోర్స్ మండల ప్రధాన కార్యదర్శి దార శేఖర్ తల్లాపేట శక్తి కేంద్ర ఇంచార్జ్ దొమ్మటి వెంకటేష్ బుమేష్ తిథితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking