బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే 125 అడుగుల విగ్రహాలను స్థాపించాలి

ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాస్
హైద్రాబాద్ జూన్ 17 : ప్రముఖ సంఘ సేవకుడు కాపు ఉద్యమ నేత ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేల్పురి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కాన్ఫరెన్స్ హాల్ సూర్యలోక కాంప్లెక్స్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ చైర్మన్ నారగోని ఐపీసీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేల్పూరు శ్రీనివాస మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఐపిసి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ దేశానికి ఎనలేని సేవలు చేసిన మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ మరియు సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 125 అడుగుల విగ్రహాలను హైదరాబాదులో స్థాపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు ఇటీవలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే 125 అడుగుల విగ్రహాలను స్థాపించాలని తద్వారా ప్రజల్లో మంచి సందేశాన్ని ఇవ్వచ్చని వేల్పురి శ్రీనివాస్ తెలిపారు త్వరలోనే అన్ని పార్టీల మద్దతు తో ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి డాక్టర్ బాలకృష్ణ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు మహిళా విభాగం నాయకులు అరుణ రెడ్డి నీనాసింగ్ చిత్ర అంజనీ దేవి సేవాదళ్ జాతీయ కార్యదర్శి అల్లాజి హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు నవీన్ ప్రచార విభాగం కార్యదర్శి బాలాజీ ఐపీసీ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నందికొండలరావు సంఘ సేవకులు శ్రీనివాస్ మరియు ఐపీసీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking