పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. నామినేషన్లు వేసే ప్రతీ అభ్యర్థి నుంచి ఐదు చొప్పున ఫోటో కాపీలను తీసుకోవాలని తెలిపారు. ఈ ఫోటో కాపీ లలో ఎటువంటి రాజకీయ,మత ఇతరత్రా గుర్తులు, చిహ్నాలు ఉండరాదని ఆదేశించారు. రేపటి నుంచి స్టాటిక్ సర్వే లైన్స్ టీంలను, ఎక్సపండిచర్ టీం లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ కార్డులలో పేరు, చిరునామా మార్పు కోసమై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అన్నారు. అర్హులైన వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించిన ఎపిక్ నెంబర్లు నమోదు కానీ డేటాను జిల్లాల వారీగా సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రిపోర్టులను సమయానికి పంపాలని అన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాలలో టెంట్లు, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కి సంబంధించిన అన్ని సూచనలను బోర్డు రూపంలో ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించకుండా నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో సమావేశ హాలు నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, నిర్మల్, బైంసా, ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, జీవక్ రెడ్డిలు, డిఆర్ఓ భుజంగ్ రావ్, ఈడీఎం నదీమ్, ఎన్నికల సూపర్ ఇండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking