పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 18 (ప్రజాబలం) ఖమ్మం ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. గురువారం వ్యయ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించు కుని నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల్లో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసు కున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిఘాకు ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ టీములని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిఘా బృందాలకు సిసి కెమెరాలు, జిపిఎస్ ట్యాగ్ సిస్టం అమర్చి, కంట్రోల్ రూం లో ఏర్పాటు చెందిన స్క్రీన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం నాటికి సి-విజిల్ ద్వారా 38 ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ ద్వారా 64 ఫిర్యాదులు రాగా పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కమిటీ ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రచార ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు ఈ సందర్భంగా నగరపాలక కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, సిపిఓ ఏ. శ్రీనివాస్, అధికారులు తదితరులు ఉన్నారు.