బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు.

మద్దతుగా బయలుదేరిన తూప్రాన్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు.

తూప్రాన్, ఏప్రిల్ 18 ( ప్రజాబలం న్యూస్ ) :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తూప్రాన్ మున్సిపాలిటీ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ తో బిజెపి మండల నాయకత్వం
బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ కు భారీగా తూప్రాన్ మున్సిపల్ నాయకులు మరియు కార్యకర్తలు మెదక్ బయల్దేరి వెళ్ళినారు. మెదక్ లోని ప్రధాన కార్యాలయంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బిజెపి నాయకులు కార్యకర్తలు ఆయనకు నామినేషన్ సమయంలో బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking