వేములవాడ టౌన్, ( ప్రజాబలం), కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో హనుమాన్ దేవాలయం ముందు శ్రీ రామాంజనేయ కళాబృందం చిరుతల రామాయణం నాటక ప్రదర్శన కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి నాటక ప్రదర్శనను ప్రారంభించారు.
నాటక ప్రదర్శన అనంతరం రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర కన్వీనర్ ఎలా పోశెట్టి మాట్లాడుతూ రెండు రోజులపాటు చిరుతల రామాయణం నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పోరండ్ల గ్రామం తో పాటు ఇతర గ్రామాల నుండి విచ్చేసిన గ్రామాల ప్రజల కు, కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ప్రాచీన కలలు కనుమరుగవుతున్న సమయంలో రంగస్థలం కళాకారులు ఏకమై ప్రాచీన కళలకు జీవం పోయాలని కళాకారుల అందరికీ కళాభివందనాలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొజ్జ ఎల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు మురళి మధు, మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ – ఉమా, మాజీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ కు జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోరాండ్ల గ్రామం మాజీ సర్పంచ్ శ్రీమతి రెడ్డి త్రివేణి- తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల రజిత- లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉల్లందుల పద్మ – ఏకనాథం, ఉత్తర తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు, పోరాండ్ల గ్రామం మాజీ ఉపసర్పంచ్ కిన్నెర సతీష్, నాటక రంగం గురువు పిట్టల సంపత్, కళాకారులు వంగ సుధాకర్, అలివేరి సమ్మిరెడ్డి, సత్రం, సరిత, బొజ్జ రాజయ్య, నీలం భాస్కర్, బొజ్జ పరశురాములు, బొజ్జ కొమురయ్య, పడాల శ్రీనివాస్, శంకర్, రమేష్, నరసయ్య, రాజయ్య, సంపత్ రావు, నారాయణరావు, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.