రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శనివారం హైదరాబాద్ నుండి సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాలతో కలిసి ఉప ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సమగ్ర కుటుంబ సర్వేకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు, కలెక్టర్ లతో చర్చించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని జిల్లా కలెక్టర్లును, ఎన్యూమరేటర్లు ను ఉప ముఖ్య మంత్రి అభినందించారు. శనివారం నుండి ప్రారంభమైన సామాజిక,ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియతో యావత్తు దేశం మొత్తం తెలంగాణను గమనిస్తున్నదని తెలిపారు.ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియలో ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు.సర్వే ప్రక్రియలో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములు అయ్యేలా ఆహ్వానించాలని తెలిపారు.సమగ్ర కుటుంబ సమాచారం సేకరణ వలన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.సర్వే సమాచారం గ్రామస్థాయిలోని ప్రతి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామ,పట్టణాల ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని,అదే ఉత్సాహంతో సర్వే పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.అధికారులు సర్వే ప్రక్రియ ను నిరంతరం పరిశీలిస్తూ సిబ్బందికి తగు సలహాలు,సూచనలు ఇవ్వాలని సూచించారు.
అనంతరం అధికారులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిర్వహించాలని ఆదేశించారు.ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని సూచించారు.సర్వే ప్రక్రియను సూపర్ వైజర్లు,మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని,సర్వే కు ముందు రోజు గ్రామాలు,పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు లేకుండా సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలాని కలెక్టర్ కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జి డిఆర్ఓ రత్నాకళ్యాణి, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్,ఎస్సి, ఎస్టీ,బిసి,మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్,శంకర్,అంబాజీ, శ్రీనివాస్,మోహన్ సింగ్, ఏడి మార్కెటింగ్ శ్రీనివాస్,ఏడి సర్వే, లాండ్ రికార్డ్ రాథోడ్ సుదర్శన్,మున్సిపల్ కమిషనర్లు ఖమర్ అహ్మద్,రాజేష్ కుమార్,మనోహర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking