దేశ ప్రజలకు ఆయుధమే ఎర్ర జెండా పోరాటాలు

 

-సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 9 :

దేశ ప్రజలకు ఆయుధమే ఎర్రజెండా పోరాటాలు నిర్వహిస్తుందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నిర్వహిస్తున్న మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి ఆర్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని జమిలి ఎన్నికల జరిపించాలని చూస్తుందన్నారు. ఆలా చేయడం ప్రజాస్వామ్యనికి పెద్ద ప్రమాదమని నేడు రాష్ట్రంలో చేస్తున్న కులగణన కూడా బీజేపీ జీర్ణించుకోవడం లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను అమలు చేయకుండా హైడ్రా పేరుతో చెరువులు కుంటలు నాళాలు అక్రమణ గురైన వాటిని తొలగించాలని చూస్తుందన్నారు. ఒకటి రెండు పెద్ద పెద్ద కన్వెన్షన్లు తీసేసి తర్వాత ఇల్లు కట్టుకున్న పేద మధ్యతరగతి కుటుంబాల ఇండ్లను ధ్వంసం చేసిందని, మరి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు కాలేశ్వరం, ప్రాణహిత ముంపు నీటి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. శ్రావణ పల్లి బొగ్గు బావులను సింగరేణికే ఇవ్వాలిని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలిని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, స్కిం వర్కర్లు, సింగరేణి కాంట్రాక్టు మరియు అసంఘటితరంగా కార్మికులకు 73వ షెడ్యూల్ ఎంప్లాయిస్ జీవోలను గెజిట్ చేసి అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రమాద బీమా తదిత సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం సిపి(ఐ)ఎం పార్టీ జిల్లా నూతన కమిటీ ఎన్నికున్నారు. సంకె రవి సిపి(ఐ)ఎం జిల్లా కార్యదర్శి, గోమస ప్రకాష్, కనికరపు అశోక్, ఎర్మ పున్నం, సిపి(ఐ)ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బోడంకి చందు, గుమాస అశోక్, దాగం రాజారాం, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, శ్యామల ఉమారాణి, కే.ప్రేమ్ కుమార్, కొండగోర్ల లింగన్న జిల్లా కమిటి సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జి. రాములు, భూపాల్, పైళ్ల ఆశయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking