మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మే 5:శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, సి.ఎం.ఆర్., ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇళ్ల స్థలాల వివరాలు అప్లోడింగ్, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, ఆయిల్ పామ్ సాగు, ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ కంటి వెలుగు, ఆరోగ్య మహిళా శిబిరాలను జిల్లా కలెక్టర్ లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించాలని, గన్నీ బ్యాగుల కోరత లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి పై జిల్లాల వారీగా సీఎస్ రివ్యూ నిర్వహించారు. అధికంగా పెండింగ్ ఉన్న జిల్లాలు 10 రోజులలో, మిగిలిన జిల్లాలు 3 రోజులో సీఎంఆర్ రైస్ డెలీవరి చేయాలని సీఎస్ తెలిపారు. .
ఈ వీడియో సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు.
