-మందమర్రిలో ఈనెల 28,29,30 న నిర్వహణ
-హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కనపర్తి రమేష్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 25:
రాష్ట్రస్థాయి 54 వ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను ఈనెల 28, 29, 30 తేదీలలో మందమర్రి పట్టణంలో గల సింగరేణి హై స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కనపర్తి రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనపర్తి రమేష్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సౌజన్యంతో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 20 మంది క్రీడాకారుల చొప్పున 200 మంది పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున 20 మంది సీనియర్ మహిళా క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఛాంపియన్ షిప్ పోటీలకు సింగరేణి సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని అందుకు సంస్థ యాజమాన్యానికి మేనేజర్ దేవేందర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ క్రీడలను జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గోనే శ్యాంసుందర్రావు, అసోసియేషన్ చైర్మన్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు గుజరాత్ లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహిస్తారని అన్నారు. ఈసమావేశంలో హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి అలుగువెల్లి రమేష్ రెడ్డి, కోచ్ సొనార్కర్ అరవింద్, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, ఆర్గనైజింగ్ నెంబర్ కర్ర మహేందర్ రెడ్డి, ఎగ్గేటి రాజేశ్వర్, రాజమౌళి లు పాల్గొన్నారు.